ఐర్లాండ్ లో ఘోర ప్రమాదం! ఇద్దరు ఎన్నారై టీడీపీ సభ్యులు (స్టూడెంట్స్) మృతి! తీరని విషాదంలో కుటుంబ సభ్యులు!

Header Banner

ఐర్లాండ్ లో ఘోర ప్రమాదం! ఇద్దరు ఎన్నారై టీడీపీ సభ్యులు (స్టూడెంట్స్) మృతి! తీరని విషాదంలో కుటుంబ సభ్యులు!

  Sat Feb 01, 2025 07:30        Europe

ఐర్లాండ్ దేశంలో విషాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం ఇద్దరు విద్యార్థులు కారు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. కాలేజీకి సెలవులు ఇవ్వడంతో టూర్ కి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా కార్లో (carlow) సిటిలో ఒక టర్నింగ్ దగ్గర చెట్టును ఢీకొనడంతో ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. మరో ఇద్దరు గాయాలతో ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తుంది. కాగా వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించడం జరిగింది. ఒకరు గుంటూరు జిల్లా రొంపిచర్ల గ్రామానికి చెందిన చెరుకూరి సురేష్, మరొకరు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గండరాయి గ్రామానికి చెందిన చిట్టూరి భార్గవ్. వీరు ఇద్దరూ కూడా ఎన్నారై టీడీపీ సభ్యులు, చదువుకుంటూనే ఎన్నారై టీడీపీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ అందరికీ చేతోడువాతోడుగా ఉండేవారు. 

 

వీరు ఐర్లాండ్లో మొదటి సంవత్సరం మాస్టర్స్ చదువుతున్న విద్యార్ధులు. రెండు రోజుల క్రితమే కారు కొనుక్కొని, డ్రైవ్ కు వెళ్లి, ఇలా మృతి చెందడం ఎంతో విషాదకరం. వీరి కుటుంబాలు అత్యంత సాధారణమైన రైతు కుటుంబాలు. విషయం తెలుసుకున్న ఐర్లాండ్ ఎన్నారై టిడిపి సభ్యులు చలసాని కిషోర్, వెంకట్ కాట్రగడ్డ ఇతర సభ్యులతో కలిసి వారి పార్ధివ దేహాలను ఇండియాకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న ఎన్నారై టిడిపి సెల్ మరియు ఏపీ ఎన్నార్టీ వెంటనే స్పందించి అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి మృతదేహాలను తరలించే ఏర్పాట్లు మరియు అలాగే తరలించడానికి అయ్యే కార్గో ఖర్చులను కుడా ఇండియన్ కమ్యూనిటీకి వెల్ఫేర్ ఫండ్ నుండి ఇప్పించవలసిందిగా కోరనున్నారు. అదే విధంగా ఐర్లాండ్ లోని ఎన్నారై టిడిపి సభ్యుల తోపాటు యూరప్ ఖండంలోని సభ్యులను కలుపుకొని ఈ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి గో ఫండ్ రైజ్ చేసి సహాయ పడవలసిందిగా కోరడమైనది. ఆ లింకు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

విషయం తెలుసుకున్న కోడెల శివరాం బాధితుడు యొక్క స్వగ్రామమైన రొంపిచర్ల గ్రామానికి వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించడం జరిగింది. ఈ విషాదానికి చింతిస్తూ ఎన్నారై మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి మృతదేహాలను వీలైనంత త్వరగా తరలించే ఏర్పాట్లు చేయమని అక్కడి టైంను కోరారు.

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం!

 

టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి! ఎవరంటే!

  

చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆ భూములు అన్నీ వారికే ఇక.. ప్రభుత్వం కొత్త చట్టం!

 

భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!

 

దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్రవాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

 

ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ ప‌నిచేయ‌వు.. కార‌ణ‌మిదే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Europe #Ireland #Accident #TeluguMigrants #IndianMigrants